KKD: వేట్లపాలెం బాణసంచా పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామర్లకోట కుమ్మరి వీధికి చెందిన దర్శిపాటి లోవరాజు (40) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో బాధితుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషాద ఘటనతో బాధితుల కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది.