PPM: రెవిన్యూ సంబంధిత కార్యకలాపాలలో మరింత వేగం పెంచాలని JC యశ్వంత్ కుమార్ రెడ్డి సూచించారు. శనివారం కలక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రీ సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకతతో నిర్ణత గడువులోగా పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తూ వెరిఫికేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదన్నారు.