GNTR: ఆయేషా మీరా శరీర అవశేషాలను తిరిగి ఖననం చేయనున్న నేపథ్యంలో తెనాలిలోని ఈద్గా వద్ద పోలీసులు భద్రతను పెంచారు. విజయవాడ సీబీఐ కోర్టు నుంచి అవశేషాలను స్వీకరించిన తల్లిదండ్రులు, నేడు మధ్యాహ్నం తెనాలి చెంచుపేటలోని ఖబరస్థాన్కు చేరుకుంటారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు ‘చలో తెనాలి’ పిలుపునిచ్చాయి.