NDL: బనగానపల్లెలో జుర్రేరు వాగు అభివృద్ధి పనులను సోమవారం మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పరిశీలించారు. వాగు సైడ్వాల్ నిర్మాణం, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. వాగుపై నిర్మాణంలో ఉన్న వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలించి, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.