GNTR: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాల్సిందిగా భట్టి విక్రమార్క సీఎంను కోరారు. ఈ మేరకు వివాహ శుభలేఖను అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ వివాహ వేడుక మార్చి 5వ తేదీన హైదరాబాద్లో జరగనుంది. ఈ సందర్భంగా నేతల మధ్య ఆత్మీయ సంభాషణ సాగింది.