KKD: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈనెల 24వ తేదీన రూరల్ వి.ఎస్. లక్ష్మీ కళాశాలలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. కలెక్టర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పదవ తరగతి నుంచి పై చదువులు చదివిన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.