TPT: పుత్తూరు మున్సిపాలిటీ 5వ వార్డు పిల్లారుపట్టులో త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చొరవతో కొత్త బోరు త్రవ్వక పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి పాల్గొని, వేసవి నీటి అవసరాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్న ఎమ్మెల్యేను అభినందించారు.