NDL: ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా శ్రీనివాసరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. నెల్లూరు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేస్తూ.. ఉన్నతాధికారుల ఉత్తర్వులతో ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని DSP వెల్లడించారు.