SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ విస్తరణకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మున్సిపాలిటీలో 36 వార్డులుగా విభజిస్తూ, ఆధునిక మౌలిక సదుపాయాలతో మాస్టర్ ప్లాన్ను అధికారులు తయారు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే శిరీష వారితో సమీక్ష నిర్వహించారు. అధికారులకు తగు సూచనలు చేసి, ఈ నెలలోనే అమలు చేయాలని ఆదేశించారు.