E.G: రంగంపేటలో ప్రముఖ కళాకారుడు దేవిన శ్రీనివాస్ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సబ్బుపై ఆయన ముఖచిత్రాన్ని రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. సుమారు 13 గంటల పాటు శ్రమించి 150 గ్రాముల సబ్బుపై చంద్రబాబు ముఖచిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. సీఎంకు 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఒక రోజు ముందుగానే కళాకృతిని శ్రీనివాస్ రూపొందించారు.