TPT: విజయవాడలోని ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శాప్ (SAP) ఛైర్మన్ రవి నాయుడు గారితో క్రీడా వేదికలు, మైదానాల సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే శ్రీకాళహస్తిలో ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని అభివృద్ధి చేయాలని శాప్ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. యువ క్రీడాకారులకు క్రీడా పరికరాలు అందించాలని కోరారు.