AP: జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు తీవ్ర వేధింపులకు గురయ్యారని ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఆరోపించారు. పెన్షనర్లు, గ్రాట్యుటీ, APGLI, APGF నిధుల విడుదలపై MLA హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రూ. 7538 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బకాయిలను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సీఎంకు వరదరాజుల రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.