BDK: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి దిశా నిర్దేశం చేసిన మహ నేత అని తెలిపారు.