JGL: జిల్లా పోలీస్ కార్యాలయంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అశోక్ కుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి అన్ని వర్గాలకు హక్కులు కల్పించారని తెలిపారు.