TG: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. డీలిమిటేషన్తో ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు పార్లమెంటులో చట్టాలు చేయకూడదని పేర్కొన్నారు.