VZM: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఇటీవల సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల మండలం జనసేన నాయకులు రామతీర్థం రామాలయంలో ఇవాళ ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆయన ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని ఆలయం మెట్ల వద్ద కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ఆలయంలో అర్చనలు చేశారు.