సత్యసాయి: జిల్లా కేంద్రం పుట్టపర్తిలో తెలుగుదేశం పార్టీ నూతన జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం ఏప్రిల్ 1న ఘనంగా నిర్వహించనున్నారు. అమూల్య లేఅవుట్ ప్రక్కన, పోలీస్ పరేడ్ గ్రౌండ్ వెళ్లేదారిలో నూతనంగా నిర్మించిన ఈ కార్యాలయాన్ని బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.