SKLM: పలాస కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహ బాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. డీఎస్పీను తక్షణమే విధులు నుంచి రిలీవ్ చేసి, మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఆదేశించారు. ఈయన స్థానంలో ఇన్ఛార్జ్ డీఎస్పీగా ఎవరిని నియమిస్తారు అనేది తెలియాల్సి ఉంది.