కృష్ణా: ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. సోమవారం చల్లపల్లి మండలం రామానగరంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వారిచే నారా లోకేష్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. శిబిరంలో 325 మంది స్క్రీనింగ్ చేయించుకున్నారు.