కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఆదివారం వైభవంగా స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణాన్ని నిర్వాహకులు ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.