AKP: ఈ ఏడాది అనకాపల్లి జిల్లా పదవ తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలవాలని డీఈఓ అప్పారావు నాయుడు అన్నారు. నక్కపల్లి మండలం వేంపాడు జడ్పీ హైస్కూల్లో ఆదివారం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి వందరోజుల ప్రణాళిక అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అన్నారు.