NLR: అనంతసాగరం, ఆత్మకూరు ప్రాంతాల్లో సోమశిల జలాశయం కింద సాగు చేసిన వరి పంట మరో వారం రోజుల్లో మార్కెట్కు రానుందని సీపీఎం, రైతు సంఘం నేతలు తెలిపారు. పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పుట్టికి కనీసం రూ.26 వేలు గిట్టుబాటు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ అనంతసాగరం తహసీల్దార్, వ్యవసాయ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు.