ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈరోజు నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 38°C నుంచి 40°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. తీవ్ర ఎండ కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రైతులు కూడా తమ పంటలను ఎండ ప్రభావం నుంచి కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.