కోనసీమ: జిల్లాకు అధికారులు పంపించిన 1,79,800 పదవ తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనాన్ని విజయవంతంగా పూర్తి చేసామని డీఈవో పి. నాగేశ్వరరావు తెలిపారు. అమలాపురంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ నుంచి బుధవారం వరకు ప్రశ్నా పత్రాలను మూల్యాంకనం చేయడం జరిగిందన్నారు. టీచర్స్‌తో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు.