మన్యం జిల్లా అభివృద్ధి సూచికల్లో వేగంగా పురోగతి సాధిస్తూ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందుతోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. తన పదవీకాలం 6 నెలలు పూర్తైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కాలంలో జిల్లా సాధించిన విజయాలు గర్వకారణమన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 112 ఆస్పిరేషనల్ జిల్లాల పోటీలో జిల్లా నిర్ణీత గడువు కంటే 3రోజుల ముందుగానే లక్ష్యాలు చేరుకున్నాయన్నారు.