TPT: TTD వద్ద శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని టీటీడీ తెలిపింది. నెయ్యి కొరతవల్ల లడ్డూ తయారీ ఆగిందన్న ప్రచారం అసత్యమని స్పష్టం చేసింది. ఒక నెయ్యి ట్యాంకర్ ప్రమాదానికి గురైనప్పటికీ సరఫరాపై ఎలాంటి ప్రభావంలేదని పేర్కొంది. ప్రస్తుతం భక్తులకు పంపిణీకి సుమారు 7 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.