NGKL: అచ్చంపేటలోని బాలసదన్ను జూనియర్ సివిల్ జడ్జి స్పందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారుల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రస్తుత ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, “ఎండల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, ఆరోగ్యం పట్ల ఎలాంటి అజాగ్రత్త వద్దు” అని చిన్నారులకు సూచించారు.