KKD: ఈ నెల 25న జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్వో తిప్పేనాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.