ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల బీచ్ ఫెస్టివల్లో చేతివాటం ప్రదర్శించిన దొంగను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. బిట్రగుంట మండలం బోగోలుకు చెందిన సునీల్ చోరీలకు పాల్పడే క్రమంలో ఓ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు.