GNTR: ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరు గ్రామంలోని రచ్చబండ సెంటర్ వద్ద స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా డిప్యూటీ సీఈవో కృష్ణ ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు.