రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, పార్టీలు- ప్రజాసంఘాలతో కలిసి రచ్చబండల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. రాయలసీమకు నష్టం జరగకుండా అందరూ కలిసిరావాలని కోరారు.