KRNL: ఆస్పరి మండలంలోని కలపరి కొండల్లో రెండు రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వానరాలను చంపినట్లు వారు తెలిపారు. ఇటీవల అట్టికల్లు సమీపంలో చిరుత కూన మృతి చెందడంతో తల్లి చిరుతే వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అటవీశాఖ అధికారలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.