అనకాపల్లి: రహదారి నిబంధనలు అతిక్రమించడంతో పాటు టోల్ ఫీజును ఎగ్గొట్టేందుకు అడ్డదారిన వెళుతున్న మూడు టిప్పర్ లారీలను పోలీసులు పట్టుకున్నారు. నక్కపల్లి మండలం ఉపమాక మీదుగా వెళుతున్న మూడు లారీలను ఎస్సై సన్నిబాబు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకుని ఆర్టీఓకు అప్పగించారు. ఒక లారీకి రూ.56,000, మరో లారీకి రూ.66,000, మూడవ లారీకి 74,000 జరిమానా విధించినట్లు తెలిపారు.