BPT: బాపట్ల పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీల్ రోడ్ సెంటర్లోని పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క పిల్లవాడు విద్యకు దూరంగా ఉండకూడదన్నారు. సమాన విద్యా అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.