CTR: జిల్లాలో PM-RAHAT పథకం అమలు చేసి రోడ్డు ప్రమాద బాధితులకు తొలి 48-72 గంటల్లో రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందిస్తున్నారు. నగరి ప్రాంతంలో ఇప్పటికే ఒక బాధితుడికి ఈ సదుపాయం కల్పించారు. ప్రమాదాల సమయంలో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి సహాయం చేసే గుడ్ సమారిటన్లకు రూ.25,000 ప్రోత్సాహకం, చట్టపరమైన రక్షణ ఉంటుందని SP తుషార్ డూడి తెలిపారు.