VZM: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని ఆయన నివాసంలో శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత కిమిడి రామ్ మల్లిక్ నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.