ATP: నకిలీ ధ్రువపత్రాలతో పనులు చేపడుతున్న రుద్ర ఇన్ఫ్రా సంస్థపై సమగ్ర విచారణ జరిపించాలని అనంతపురం మాజీ మేయర్ మహమ్మద్ వసీం డిమాండ్ చేశారు. ఎలాంటి అనుభవం లేని సంస్థకు అధికారులు రూ.3 కోట్ల పనులు కేటాయించడంపై ఆయన విమర్శలు గుప్పించారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.