NDL: టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కుమారుడి వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తెతో ఈ వివాహం జరిగింది. నూతన వధూవరులు జనార్దన్ రెడ్డి-సనాతనిని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. ఈ శుభకార్యానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.