SKLM: శ్రీకాకుళం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాల పై ఎస్సైహరి కృష్ణ సోమవారం తనిఖీలు చేశారు. నాగావళి నది ఒడ్డున అనుమానస్పదంగా ఉన్న ముగ్గురు నిందితులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద నుంచి 3 కిలోల గంజాయి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.