W.G: భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలోని కోదండ రామాలయంలో శనివారం శ్రీసీతారామచంద్ర లక్ష్మణ, హనుమ, గణపతి, సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, అగ్ని ప్రతిష్టాపన హోమం నిర్వహించారు.