కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు ఆదివారం సికింద్రాబాద్ తిరుమలగిరి వాస్తవ్యులు గుంటూరి గంగాధర శాస్త్రి, సీతమ్మ వారి కుటుంబ సభ్యులు రూ.1,01,116 లక్షల విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. ఆయన దాతకు స్వామివారి చిత్రపటం అందజేశారు.