సత్యసాయి: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా సోమందేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డా. ఓంకార్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. మలేరియా, డెంగీ తదితర దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. దోమతెరల వినియోగం, పరిశుభ్రత పాటించడం వంటి సూచనలు చేశారు. వడదెబ్బ నివారణపై కూడా జాగ్రత్తలు వివరించారు.