కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో 230 పరిశ్రమల యూనిట్ల పురోగతి గురించి పరిశ్రమల అధికారులతో కలెక్టర్ బాలాజీ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, వారికి కావాల్సిన సహకారం అన్ని విధాల అందిస్తామని, ప్రభుత్వ రాయితీలు మంజూరు చేస్తామన్నారు.