KRNL: బంటనహళ్ గ్రామ యువత చేసిన నిరంతర పోరాటం, పట్టుదల ఫలితంగా శ్మశానవాటిక బ్రిడ్జి, అభివృద్ధి పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. పంచాయతీ రాజ్ శాఖ ఏఈ సోమప్ప గ్రామానికి విచ్చేసి కాంట్రాక్టర్, సర్పంచ్ కుమారుడు, గ్రామ పెద్దలు, యువతతో సమావేశమయ్యారు. బ్రిడ్జి నిర్మాణం నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.