సత్యసాయి: ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని హిందూపురం డీఎస్పీ మహేష్ వాహనదారులకు సూచించారు. మంగళవారం లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌలసముద్రం టోల్ ప్లాజా రోడ్డుపై వాహనాలు తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, ఎస్సై నరేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.