MDCL: నాగోల్లోని RTA కార్యాలయం సమీపంలో PDS బియ్యం అక్రమ మళ్లింపుపై విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు వాహనాలను అడ్డుకుని తనిఖీ చేశారు. మొత్తం 114 బస్తాల బియ్యం (5510 కిలోలు), 14 బస్తాల గోధుమలు (684 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.3,35,536 విలువైన ఈ సరుకుపై ఈసీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.