GDWL: ధరూర్ మండల కేంద్రంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, సర్పంచ్ డి.ఆర్. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎండల్లో పనిచేసే కూలీలకు ఉపశమనం కలిగించేందుకు ఇలాంటి చర్యలు తీసుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.