HYD: నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ఈనెల 14న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ బయోపిక్ ప్రదర్శించనున్నారు. తెలుగు లలితకళా తోరణంలో ఈ ప్రదర్శన ఉంటుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రదర్శన ఉంటుందని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.