VSP: విశాఖలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. జడ్పీ సీఈఓ నారాయణమూర్తి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుందని పేర్కొన్నారు.