KRNL: పెద్దకడబూరు మండలంలో వంటగ్యాస్ సరఫరాపై ఉన్న అపోహలను నమ్మవద్దని MRO గీతప్రియదర్శిని ఇవాళ తెలిపారు. అపోహలకులోనై ప్రజలు గ్యాస్ గోదాముల వద్దకు వెళ్లి ఇబ్బందులు కలిగించవద్దని కోరారు. గ్యాస్ బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయకుండా, ఏజెన్సీలు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు వసూళ్లు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.